
పడవ బోల్తా, మత్స్యకారుడు మృతి, మరో ముగ్గురు గల్లంతు
ఈ వార్తాకథనం ఏంటి
కేరళలో జరిగిన పడవ ప్రమాదంలో ఒక మత్స్యకారుడు మృతి చెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు.
తిరువనంతపురం పెరుమాతురలోని ముత్యాలపోజి హార్బర్‌లో సోమవారం తెల్లవారుజామున పడవ బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది.
మృతి చెందిన వ్యక్తిని పుత్తుకురిచ్చికి చెందిన కుంజుమోన్‌గా గుర్తించారు. గల్లైంతన వారిని బిజు, మందాస్, బిజుగా అధికారు చెప్పారు. వీరందరూ పుతుకురిచ్చికి చెందినవారని పోలీసులు చెప్పారు.
నలుగురు ప్రయాణిస్తున్న ఫైబర్ బోటు తెల్లవారుజామున 4 గంటలకు సముద్రంలోకి వస్తుండగా హార్బర్ ప్రవేశ ద్వారం వద్ద బోల్తా పడింది.
చీకటిగా ఉండడంతో ఈ ప్రమాదాన్ని ఇతర మత్స్యకారులు గమనించలేకపోయినట్లు స్థానికులు చెబుతున్నారు.
కేరళ
హార్బర్‌ను అశాస్త్రీయంగా నిర్మించడం వల్ల ప్రమాదాలు పెరిగియ్: మత్స్యకారులు
పడవ బోల్తా పడ్డ విషయం తెలుసుకున్న మత్స్యకారులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టి కుంజుమోన్‌ను వెలికితీశారు. అయితే అతను ఊపిరి పీల్చుకున్నప్పటికీ చిరాయింకీజు తాలూకా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు.
సముద్రం అల్లకల్లోలంగా ఉందని, హార్బర్‌ను అశాస్త్రీయంగా నిర్మించడం వల్ల ప్రమాదాల తీవ్రత పెరిగిందని ఆ ప్రాంత మత్స్యకారులు తెలిపారు.
గత తొమ్మిదేళ్లుగా ముత్యాలపోజి, సమీప సముద్ర తీర ప్రాంతాల్లో మత్స్యకారులు మునిగిపోయిన సంఘటనలు 6o కంటే ఎక్కువ ఉన్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
హార్బర్ నిర్మాణం లోపభూయిష్టంగా ఉండడం వల్ల ముత్యాలపోజి వద్ద మునగ ఘటనలు పెరుగుతున్నాయని మత్స్యకారులు ఫిర్యాదులు చేస్తున్నారు.