LOADING...
Chhattisgarh: మందుపాతర పేలి ముగ్గురు జనాన్లు మృతి
మందుపాతర పేలి ముగ్గురు జనాన్లు మృతి

Chhattisgarh: మందుపాతర పేలి ముగ్గురు జనాన్లు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
May 02, 2026
04:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మందుపాతర పేలుడులో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోగా, మరో జవాన్ తీవ్రంగా గాయపడ్డారు. కాంకేర్ జిల్లాలోని చోటాబిటియా పోలీస్‌స్టేషన్ పరిధిలో ఉన్న మార్కాబేడా అడవుల్లో భద్రతా దళాలు కూంబింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. రోడ్డుపై మావోయిస్టులు అమర్చిన మందుపాతరను జవాన్లు గుర్తించారు. దానిని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తుండగా అకస్మాత్తుగా పేలుడు సంభవించింది. దీంతో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు గాయాలతో బయటపడ్డారు.

Advertisement