Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ నుంచి బీద మస్తాన్‌రావు, ఆర్. కృష్ణయ్య, సానా సతీష్ రాజ్యసభ సభ్యులుగా ఏకగీవ్రంగా ఎన్నికైన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్, వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల జరిగిన రాజ్యసభ ఉపఎన్నికల్లో, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ నుంచి బీద మస్తాన్‌రావు, సానా సతీష్ బాబు, బీజేపీ నుంచి ఆర్. కృష్ణయ్య ఈ మూడు స్థానాలకు ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో వీరు ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కూటమి మొత్తం 164 స్థానాలు గెలిచిన నేపథ్యంలో ఈ ముగ్గురి ఎన్నిక కూడా ఏకగ్రీవంగా జరిగిందని పేర్కొంది.