Madhyapradesh: మధ్యప్రదేశ్‌లో వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్ తీసుకున్న పులి
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రదేశ్‌లో ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించిన ఘటన జరిగింది. గ్రామ పరిధిలోకి చొరబడిన పులి ఓ వ్యక్తిపై అకస్మాత్తుగా దాడి చేసింది. ఆ తర్వాత అక్కడే ఉన్న ఓ ఇంటి బయట మంచంపై కొన్ని గంటల పాటు విశ్రాంతి తీసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను బంధవ్‌గఢ్ టైగర్ రిజర్వ్ అధికారులు వెల్లడించారు. టైగర్ రిజర్వ్‌కు సమీపంలోని గ్రామంలోకి వచ్చిన పులి, ఇంటి ముందు ఉన్న గోపాల్ కోల్ అనే వ్యక్తిపై దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. అనంతరం అదే ప్రాంతంలో ఉన్న మంచంపై సేదతీరింది. పులిని చూసి గ్రామస్థులు భయంతో ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా వెనుకాడారు.
వివరాలు
ఎనిమిది గంటల తర్వాత అదుపులోకి..
ప్రాణభయంతో కొందరు ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి అక్కడే ఉండిపోయారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. దాదాపు ఎనిమిది గంటల పాటు శ్రమించి పులిని అదుపులోకి తీసుకొని అటవీ ప్రాంతంలోకి తరలించారు. దీంతో గ్రామంలో నెలకొన్న భయాందోళనలు తగ్గి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. పులి దాడిలో గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. అయితే టైగర్ రిజర్వ్‌కు సమీపంలో ఉండటంతో తమ గ్రామంలోకి తరచూ పులులు వస్తుంటాయని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని వారు వాపోయారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టైగర్ రిజర్వ్ సమీప గ్రామంలో పులి కలకలం
बांधवगढ़ टाइगर रिजर्व में बाघ पर पत्थर बरसाए
— Ajay Dubey (@Ajaydubey9) December 29, 2025
Human-wildlife conflict management in Madhya Pradesh collapses 😔
🐯 #tiger @CMMadhyaPradesh @PMOIndia @ntca_india @moefcc pic.twitter.com/OfWAFDo5zg