LOADING...
Nara Lokesh: తిలక్ వర్మ బహుమతి నాకేంతో ప్రత్యేకం : నారా లోకేశ్
తిలక్ వర్మ బహుమతి నాకేంతో ప్రత్యేకం : నారా లోకేశ్

Nara Lokesh: తిలక్ వర్మ బహుమతి నాకేంతో ప్రత్యేకం : నారా లోకేశ్

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 29, 2025
05:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ మంత్రి నారా లోకేశ్‌కు ఆసియా కప్ ఫైనల్ హీరో తిలక్ వర్మ ప్రత్యేక బహుమతి ప్రకటించారు. పాకిస్థాన్‌తో జరిగిన ఆసియా కప్ ఫైనల్‌లో తిలక్ వర్మ ఉపయోగించిన కెప్‌ను ఆయన ప్రేమతో లోకేశ్‌కు ఇస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ క్రమంలో తిలక్ వర్మ క్యాప్‌పై సంతకం చేస్తున్న వీడియోను కూడా షేర్ చేశారు. ఈ బహుమతి పొందిన మంత్రి లోకేశ్‌ ఆహ్లాదం వ్యక్తం చేశారు. ''తమ్ముడు తిలక్ వర్మ ఇచ్చిన బహుమతి నా కోసం ఎంతో ప్రత్యేకం.స్వదేశానికి వచ్చాక అతడి చేతుల మీదుగానే క్యాప్‌ను స్వీకరిస్తానని ఆయన 'ఎక్స్'‌లో పోస్టు చేశారు. ఫైనల్‌లో తిలక్ వర్మ 69 పరుగులు చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

క్యాప్ పంపిన తిలక్ వర్మ