Loading...
TIMS: నేడే 1,000 పడకల టిమ్స్‌ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
నేడే 1,000 పడకల టిమ్స్‌ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

TIMS: నేడే 1,000 పడకల టిమ్స్‌ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
08:30 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌) సనత్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సోమవారం సాయంత్రం 4.30 గంటలకు ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర్‌ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ తదితరులు హాజరుకానున్నారు. 22.6 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,100 కోట్ల వ్యయంతో టిమ్స్‌ నిర్మాణాన్ని పూర్తి చేశారు. మొత్తం వెయ్యి పడకల సామర్థ్యంతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో ఆసుపత్రిని తీర్చిదిద్దారు. ఐదు బ్లాకుల్లో అవసరమైన అన్ని వసతులను ఇప్పటికే సిద్ధం చేశారు.

వివరాలు 

టిమ్స్‌ సనత్‌నగర్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా మాజీ డీఎంఈ

ఇటీవల నిర్వహించిన ట్రయల్‌ రన్‌లో భాగంగా డే కేర్‌ విభాగాలను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఈ సమయంలో రోజుకు సుమారు 250 మంది రోగులకు వైద్య సేవలు అందించారు.

టిమ్స్‌ సనత్‌నగర్‌ ఇన్‌ఛార్జి డైరెక్టర్‌గా మాజీ డీఎంఈ డా.ఎ.నరేంద్రకుమార్‌ను, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్‌గా మాజీ ఏడీఎంఈ డా.మహబూబ్‌ ఖాన్‌ను ప్రభుత్వం నియమించింది.

గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆసుపత్రుల నుంచి వచ్చిన వైద్య సిబ్బందితో పాటు ఇటీవల కొత్తగా నియమించిన సుమారు 200 మంది వైద్య సిబ్బంది కూడా టిమ్స్‌లో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నారు.

వివరాలు 

ప్రారంభోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: మంత్రి దామోదర్

డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ సనత్‌నగర్‌ ప్రారంభోత్సవానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.

సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి టిమ్స్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం మంత్రి ఆసుపత్రిలో సమీక్షా సమావేశం నిర్వహించారు.

సమీక్షకు ముందు మంత్రి ఆసుపత్రిలోని వివిధ విభాగాలను పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను స్వయంగా తనిఖీ చేశారు.

అనంతరం అధికారులతో మాట్లాడిన ఆయన.. ప్రారంభోత్సవానికి వచ్చే ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వైద్యులు, మీడియా ప్రతినిధులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు.

ADVERTISEMENT

వివరాలు 

ప్రారంభోత్సవ ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలి: మంత్రి దామోదర్

ముఖ్యంగా భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పోలీసులు, ఇతర ప్రభుత్వ శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు.

డా.ఎంసీఆర్‌ టిమ్స్‌ రాష్ట్ర వైద్య రంగంలో కీలకమైన కార్యక్రమమని పేర్కొన్నారు.

ఆసుపత్రి ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు.

ఈ సమీక్ష సమావేశంలో ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి డా.క్రిస్టినా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ డా.సంగీత సత్యనారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ADVERTISEMENT