Loading...
Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి మార్చలేమన్న సుప్రీంకోర్టు
తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి మార్చలేమన్న సుప్రీంకోర్టు

Supreme Court: తిరుపతి లడ్డూ కల్తీ కేసు.. విచారణను ఏపీ వెలుపలికి మార్చలేమన్న సుప్రీంకోర్టు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 05, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఈ కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ వెలుపలికి బదిలీ చేయాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు ప్రస్తుతానికి తిరస్కరించింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా విచారణను వేరే రాష్ట్రానికి మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ్‌ దవే వాదనలు వినిపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం ప్రతికూల వాతావరణం నెలకొందని, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి నిరంతరం రాజకీయ ప్రకటనలు చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వివరాలు 

ఇప్పటికే అందరినీ మౌనంగా ఉండేలా చేశాం: సీజేఐ

ఈ వాదనలపై భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ స్పందించారు.

గతంలో ఇచ్చిన ఆదేశాల ద్వారా ఇప్పటికే అందరినీ మౌనంగా ఉండేలా చేశామని పేర్కొన్నారు.

ఒకవేళ భవిష్యత్తులో ఏవైనా అనుకోని పరిణామాలు చోటుచేసుకుంటే మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని స్పష్టం చేశారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కేసు విచారణను ఆంధ్రప్రదేశ్‌ వెలుపలికి బదిలీ చేయడానికి తగిన కారణాలు లేవని సీజేఐ అభిప్రాయపడ్డారు. దీంతో ఈ పిటిషన్‌పై నిర్ణయాన్ని ముగించారు.

ADVERTISEMENT