LOADING...
Tirupati: క్యాట్‌లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన తిరుపతి యువకుడు 
క్యాట్‌లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన తిరుపతి యువకుడు

Tirupati: క్యాట్‌లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన తిరుపతి యువకుడు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 25, 2025
09:46 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM) సంస్థల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (CAT)లో తిరుపతికి చెందిన ఎ.శ్రీవల్లభ 99.94 పర్సెంటైల్‌తో జాతీయస్థాయిలో 150 ర్యాంక్‌ సాధించాడు. ఈ ఏడాది నవంబర్ 30న జరిగిన క్యాట్ పరీక్షకు మొత్తం 2.58 లక్షల మంది నేషనల్ లెవల్‌లో హాజరయ్యారు. బుధవారం విడుదలైన ఫలితాల ప్రకారం,రాష్ట్రం నుంచి 150 ర్యాంక్‌లోపల ఉన్న అభ్యర్థుల సంఖ్య 15 మందికి మించి ఉండదు అని తెలుస్తోంది.

వివరాలు 

99.94 పర్సెంటైల్

తిరుపతి టీటీడీ గోశాల డైరెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న పశువైద్య వర్సిటీ అధ్యాపకులు డా. ఎ.వి.ఎన్‌.శివకుమార్ కుమారుడు శ్రీవల్లభ, ఎస్‌బీఐ ప్రధాన కార్యాలయం మేనేజర్ ప్రియంవధ కుమారుడైన శ్రీవల్లభ, ముంబైలోని ఐఐటీ నుండి ఇంజినీరింగ్ పూర్తిచేశాడు. తన తొలి ప్రయత్నంలోనే 99.94 పర్సెంటైల్ సాధించడం వలన, అహ్మదాబాద్, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాల్లోని ఐఐఎంలలో ప్రవేశం పొందే అవకాశం కలిగింది.

Advertisement