రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల చేసిన టీఎంసీ.. ఈనెల 24న పోలింగ్
రాజ్యసభ స్థానాలకు పోటీ చేయనున్న అభ్యర్థుల జాబితాను తృణముల్ కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నెల 24న బెంగాల్ లోని ఆరు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థిత్వం ఖరారైన జాబితా వివరాలు : 1. డెరెక్ ఒబ్రెయిన్, పశ్చిమ బెంగాల్ 2. డోలా సేన్, పశ్చిమ బెంగాల్ 3. ప్రదీప్ భట్టాచార్య, పశ్చిమ బెంగాల్ 4. సుస్మిత దేవ్, పశ్చిమ బెంగాల్ 5. శాంత ఛేత్రి, పశ్చిమ బెంగాల్ 6. సుఖేందు శేఖర్ రే, పశ్చిమ బెంగాల్ మరోవైపు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంతో పాటు గోవా, గుజరాత్ లోని 10 రాజ్యసభ స్థానాలకు ఇప్పటికే ఎన్నికల నగారా మోగింది. బెంగాల్ లో 6, గుజరాత్‌లో 3, గోవాలో ఒక స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి.
నామినేషన్ దాఖలు చేసేందుకు జులై 13 లాస్ట్ డేట్ : సీఈసీ
జులై 24న పోలింగ్ జరిగిన తర్వాత రోజు ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతామని ఎన్నికల సంఘం గతంలోనే ప్రకటించింది. జులై 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది. నామపత్రాలు దాఖలు చేసేందుకు జులై 13ను తుది గడువుగా ఈసీ నిర్ణయించింది. గుజరాత్ నుంచి బీజేపీ సభ్యులుగా ఎస్ జైశంకర్, దినేశ్ చంద్ర జెమల్‌భాయ్ అనవడియ, లోఖండ్‌వాలా జుగల్‌సింహ్ మాథుర్‌లు కొనసాగుతున్నారు. ప్రస్తుతం వారి పదవీ కాలం ఆగస్టు 18తో ముగుస్తుంది. మరోవైపు గోవా బీజేపీ సభ్యుడు వినయ్ పదవీ కాలం సైతం జులై 28తో ముగియనుంది. బెంగాల్ నుంచి ఒబ్రెయిన్, డోలాసేన్, ప్రదీప్ భట్టాచార్య, సుస్మిత దేవ్, శాంత ఛేత్రి, సుఖేందుల పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో టీఎంసీ కొత్త అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది.