Hyderabad: నేడు జుమాతుల్ విదా.. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 20, 2026
08:57 am
ఈ వార్తాకథనం ఏంటి
రంజాన్ నెలలో చివరి శుక్రవారం అయిన జుమాతుల్ విదా సందర్భంగా ఛార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జాయ్ డేవిస్ ప్రకటించారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ నియంత్రణలు అమల్లో ఉంటాయని తెలిపారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని సూచించారు.
Details
ట్రాఫిక్ మార్పుల వివరాలు ఇలా ఉన్నాయి
నయాపూల్ వైపు నుంచి చార్మినార్‌కు వచ్చే వాహనాలను మదీనా జంక్షన్ వద్ద నుంచి సిటీ కాలేజీ వైపు మళ్లిస్తారు. నాగులచింత, శాలిబండ ప్రాంతాల నుంచి చార్మినార్‌కు వచ్చే వాహనాలను హిమ్మత్‌పురా జంక్షన్ వద్ద నుంచి హరీబౌలి, ఓల్గా హోటల్ దిశగా మళ్లిస్తారు. జుమాతుల్ విదా సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఈ ట్రాఫిక్ ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.