Page Loader
National Flag Day: ఇవాళే జాతీయ జెండా దినోత్సవం.. తిరంగ చరిత్రపై ఓసారి చూద్దాం!
ఇవాళే జాతీయ జెండా దినోత్సవం.. తిరంగ చరిత్రపై ఓసారి చూద్దాం!

National Flag Day: ఇవాళే జాతీయ జెండా దినోత్సవం.. తిరంగ చరిత్రపై ఓసారి చూద్దాం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 22, 2025
02:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రతేడాది జూలై 22న భారతదేశం జాతీయ జెండా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటుంది. ఈ రోజును తిరంగ దత్తత దినోత్సవం అని కూడా పిలుస్తారు. ఈసారి ఇది 2025, జూలై 22 మంగళవారం నాడు జరగనుంది. భారత రాజ్యాంగ సభ 1947 జూలై 22న దేశ జాతీయ జెండాగా త్రివర్ణ పతాకాన్ని అధికారికంగా స్వీకరించింది. అప్పటినుంచి ప్రతి ఏటా ఇదే రోజు మన జెండా గురించి గుర్తు చేసుకునే దినంగా నిలిచింది.

Details

జాతీయ జెండా - కాలక్రమంలో పరిణామం

మన జాతీయ జెండా అనేక దశలుగా రూపాంతరం చెందింది. 1904లో సిస్టర్ నివేదిత రూపొందించిన తొలి జెండా, ఎరుపు, పసుపు రంగులతో రూపొందించారు. బెంగాలీ భాషలో 'వందే మాతరం' అనే పదాలతో రూపొందించిన ఆ జెండా విజయాన్ని, శక్తిని సూచించేది. స్వాతంత్య్ర ఉద్యమంలో అనేక డిజైన్లు ప్రతిపాదించబడ్డాయి. అనంతర కాలంలో చివరకు మూడు రంగుల చారలతో కూడిన ప్రస్తుత తిరంగా జెండా రూపుదిద్దుకుంది. కాషాయ, తెలుపు, ఆకుపచ్చ రంగులతో పాటు మధ్యలో అశోక చక్రంను జతచేశారు. ఇది జూలై 22, 1947న అధికారికంగా జాతీయ జెండాగా గుర్తించారు. మొదటగా చరఖా ఉండేది, కానీ తరువాత అశోక చక్రంతో భర్తీ చేశారు.

Details

డిజైనర్ ఎవరు?

మన జాతీయ జెండాను అభిషేక్ మిత్ర రూపొందించారు. దేశ స్వాతంత్య్రానికి నిదర్శనంగా 1947 ఆగస్టు 15న, భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ, ఈ జెండాను తొలిసారి ఎర్రకోటపై ఎగురవేశారు. జెండా దినోత్సవం పరమార్థం ఈ దినం పౌరులలో దేశభక్తి, జాతీయ ఐక్యత, గర్వాన్ని పెంపొందిస్తుంది. అలాగే పౌరులుగా బాధ్యతను గుర్తు చేస్తుంది. జెండాను గౌరవించే విధానాలను జాతీయ జెండా నియమావళిలో ప్రస్తావించారు.

Details

త్రివర్ణ పతాకంలో ప్రతీసూచన ఏమిటి?

కాషాయ రంగు : ధైర్యం, త్యాగం, శౌర్యాన్ని సూచిస్తుంది తెలుపు రంగు : శాంతి, సత్యం, స్వచ్ఛతకు ప్రతీక ఆకుపచ్చ రంగు : వ్యవసాయ వారసత్వం, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు సూచకం నీలి అశోక చక్రం: ఇది "చట్ట చక్రం", నిరంతర కదలిక, పురోగతిని సూచిస్తుంది ఈ రోజున జరిగే కార్యక్రమాలు జెండా దినోత్సవాన్ని పురస్కరించుకొని పాఠశాలలు, సర్కారు కార్యాలయాలు, ఇతర సంస్థలు - జెండా చరిత్ర, దాని ప్రాముఖ్యత, ప్రదర్శన నియమాలపై విద్యా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తాయి. ఈ ఏడాది భారత జాతీయ జెండా స్వీకరించి 78 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని, తిరంగను గర్వంగా ఎగురవేసి, దేశానికి సేవ చేసిన వీరులను స్మరించుకుందాం.