
Jubilee Hills Bye-Election: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్లకు నేడే డెడ్‌లైన్.. ఇప్పటివరకు ఎన్ని వచ్చాయంటే?
ఈ వార్తాకథనం ఏంటి
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నామినేషన్ల దాఖలు ప్రక్రియ ఈరోజుతో ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు రిటర్నింగ్ ఆఫీసర్ ప్రకటించారు. చివరి రోజు కావడంతో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 94 మంది అభ్యర్థులు 127 సెట్ల నామినేషన్లను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ రెండు సెట్ల నామినేషన్లు వేయగా, బీఆర్‌ఎస్ తరఫున మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
Details
24న నామినేషన్లను ఉపసంహరించుకొనే అవకాశం
అదే పార్టీకి చెందిన పి. విష్ణు వర్ధన్ రెడ్డి డమ్మీ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ఆయన భార్య నామినేషన్ సమర్పించగా, దీపక్ రెడ్డి ఈరోజు మరో సెట్ నామినేషన్ వేయనున్నట్లు సమాచారం. ఇప్పటివరకు 63 మంది స్వతంత్ర అభ్యర్థులతో పాటు 25 రిజిస్టర్డ్ రాజకీయ పార్టీల అభ్యర్థులు కూడా తమ నామినేషన్లు సమర్పించారు. రేపు అధికారులు నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.