
నేడు నిజామాబాద్‌కు వస్తున్న ప్రధాని మోదీ.. రూ.8,021 కోట్ల పనులకు శంకుస్థాపన
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం నిజామాబాద్‌కు వస్తున్నారు. మూడు రోజుల వ్యవధిలో ఆయన తెలంగాణలో రెండోసారి పర్యటిస్తున్నారు.
జాతీయ పసుపు బోర్డును ప్రకటించిన తరువాత తొలిసారి నిజామాబాద్‌కు వస్తున్నారు. గత ఎన్నికల్లో పసుపు బోర్డు హామీతోనే ధర్మపురి అరవింద్ బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.
నిజామాబాద్ పర్యటన సందర్భంగా మోదీ రూ.8,021 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు.
ఈ నెల 1న మహబూబ్‌నగర్ పర్యటన సందర్భంగా రూ.13,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను మోదీ ప్రారంభించిన విషయం తెలిసిందే.
ప్రధాని మోదీ పర్యటన వేళ.. బీజేపీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది.
మోదీ
ప్రధాని హోదాలో తొలిసారి నిజామాబాద్‌కు వస్తున్న మోదీ
నిజామాబాద్‌లో ప్రధాని మోదీ సభ కోసం గిర్రాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు.
బీజేపీ బీజేపీ నాయకత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. మధ్యాహ్నం 2.55 గంటలకు ప్రధాని మోదీ నిజామాబాద్‌కు చేరుకుంటారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి జాతికి అంకితం చేస్తారు.
నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి దాదాపు 1.5 లక్షల మందిని సభకు బీజేపీ నాయకులు తరలించనున్నారు.
2014లో ఎన్నికల సమయంలో మోదీ ప్రచారం కోసం నిజామాబాద్‌కు వచ్చారు. అయితే అయన తొలిసారిగా ప్రధాని హోదాలో నిజామాబాద్‌కు వస్తున్నారు.