తదుపరి వార్తా కథనం

రేపు తెలంగాణ 'ఇంటర్ ఫలితాలు-2023' ! ఈ లింక్స్ ద్వారా రిజల్ట్స్‌ను తెలుసుకోండి
వ్రాసిన వారు
Stalin
May 08, 2023
11:09 am
ఈ వార్తాకథనం ఏంటి
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను విడుదల చేయడానికి తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టీఎస్ బీఐఈ) సిద్ధమవుతోంది.
ఫలితాలు మంగళవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
పరీక్షకు హాజరైన అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌లు tsbie.cgg.gov.in, manabadi.co.inలో చూసుకోవచ్చు.
ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు నిర్వహించారు. సుమారు ఐదు లక్షల మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
ఫలితాలు
ఇంటర్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి
1: tsbie.cgg.gov.inలో లాగిన్ అవ్వాలి.
2: ఇంటర్ ఫలితాల లింక్‌పై క్లిక్ చేయండి. అది మరొక కొత్త పేజీకి వెళ్తుంది.
3: టీఎస్ ఇంటర్ ఫలితాలు 2023 లింక్‌పై క్లిక్ చేయండి.
4: హాల్ టికెట్ నంబర్‌తో పాటు అడిగిన వివరాలను నమోదు చేయాలి.
5: ఆ తర్వాత ఫలితాలు డిస్ ప్లే అవుతాయి.
మీరు పూర్తి చేశారు