
Bandipora: బందిపొరాలో ఎన్‌కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
ఈ వార్తాకథనం ఏంటి
జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్‌కు గురిచేసింది.
మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్ ప్రాంతంలో పర్యాటకులపై ముష్కరులు విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు.
ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి కారణంగా భారత సైన్యం అప్రమత్తమైంది.
జమ్మూ ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించి పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించాయి.
శుక్రవారం ఉదయం బందిపొరా జిల్లాలో ఉగ్రవాదులపై ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో లష్కరే తోయిబాకు చెందిన టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతమయ్యాడు.
వివరాలు
భారత సైన్యం,జమ్మూ పోలీసులు సంయుక్త ఆపరేషన్
పెహల్‌గామ్ దాడి నేపథ్యంగా, భద్రతా బలగాలు గత మూడు రోజులుగా కశ్మీర్ లోయలో ఉగ్రవాదులపై తీవ్రంగా ఆపరేషన్లు చేపడుతున్నారు.
విస్తృతంగా సెర్చ్ ఆపరేషన్‌లు చేపట్టి ఉన్నత నిఘా సమాచారంతో బందిపొరాలో ఉగ్రవాదులు నక్కి ఉన్నట్లు తెలిసింది.
దీంతో భారత సైన్యం,జమ్మూ పోలీసులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు.ఈ ఆపరేషన్‌లో ఎదురు కాల్పులు చోటు చేసుకుని,లష్కరే తోయిబా టాప్ కమాండర్ అల్తాఫ్ లల్లి హతమయ్యాడు.
ఈ ఘటనలో రెండు పోలీసు సిబ్బందికి గాయాలైనట్లు సమాచారం. ప్రస్తుతం ఆ ప్రాంతంలో కాల్పులు కొనసాగుతున్నాయి.
వివరాలు
ఆర్మీ కమాండర్లు.ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో ఆర్మీ చీఫ్ జనరల్ భేటీ
ఉగ్రదాడి తర్వాత, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది జమ్మూ కశ్మీర్‌కు పర్యటించనున్నారు.
ఆయన శ్రీనగర్, ఉదమ్‌పూర్ ప్రాంతాలలో పర్యటించి, అక్కడి ఆర్మీ కమాండర్లు.ఇతర భద్రతా ఏజెన్సీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.
ఈ సమావేశంలో ఎల్‌వోసీ వద్ద ప్రస్తుత పరిస్థితులపై ఆయన చర్చించనున్నారు. తదుపరి చర్యలపై ద్వివేది భద్రతా బలగాలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
బందిపొరాలో లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
BIG BREAKING: Top Lashkar Commander Altaf Lalli Eliminated in Bandipora encounter
— Republic (@republic) April 25, 2025
Tune in to LIVE TV for all the fastest #BREAKING alerts - https://t.co/LFoJvUNcyH pic.twitter.com/HWdSrX1IOc