LOADING...
Telangana: పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!
పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!

Telangana: పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 20, 2026
09:10 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు వాటికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. రహదారి భద్రతను పెంపొందించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల్లో బాధ్యత పెంచే లక్ష్యంతో రవాణా శాఖ కఠినమైన 'స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్' (SOP)ను రూపొందించింది. ఈ విధానం ప్రకారం ఒక వాహనంపై ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉంటే ఆ వివరాలు నేరుగా రవాణా శాఖకు చేరతాయి. వెంటనే సంబంధిత వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ (DL)లేదా వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)ను అధికారులు బ్లాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకసారి DLలేదా RC బ్లాక్ అయితే పెండింగ్ చలాన్లన్నీ చెల్లించే వరకు ఎటువంటి ఆర్టీఏ సేవలు పొందలేరు.

Details

45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి

ఒకసారి DLలేదా RC బ్లాక్ అయితే పెండింగ్ చలాన్లన్నీ చెల్లించే వరకు ఎటువంటి ఆర్టీఏ సేవలు పొందలేరు. కెమెరా ఆధారిత చలాన్లను 3 రోజుల్లోగా మాన్యువల్ చలాన్లను 15 రోజుల్లోగా వాహనదారులకు పంపాలని ఈ కొత్త నిబంధనలు పేర్కొంటున్నాయి. చలాన్ అందిన 45 రోజుల్లోపు జరిమానా చెల్లించాలి లేదా అభ్యంతరం నమోదు చేయాలి.

Details

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక అథారిటీ

చలాన్లపై వచ్చే అభ్యంతరాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా 'గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ'ను ఏర్పాటు చేయనుంది. సాంకేతిక లోపాలు, వాహనం విక్రయించిన తర్వాత వచ్చే తప్పుడు చలాన్ల వంటి సమస్యలను వాహనదారులు ఆన్‌లైన్ పోర్టల్ ద్వారా నమోదు చేయవచ్చు. ఫిర్యాదు అందిన 30 రోజుల్లోపు అధికారులు నిర్ణయం తీసుకుంటారు.అధికారుల నిర్ణయంతో అసంతృప్తి ఉంటే, చలాన్ మొత్తంలో 50 శాతం చెల్లించి కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కూడా కల్పించారు. ఈ కొత్త విధానం ద్వారా కేంద్ర మోటార్ వాహన నిబంధనల అమలులో పారదర్శకత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.ఈ విధానానికి సంబంధించిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను రవాణా శాఖ త్వరలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం

Advertisement