LOADING...
Andhra Pradesh: పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ
పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ

Andhra Pradesh: పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 09, 2025
03:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

వశిష్ఠ గోదావరి తీరం 60 కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రకృతి అందాన్ని మనకు అందిస్తుంది. కానీ అందులోనూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది పేరుపాలెం బీచ్‌... ఇది పశ్చిమ దిశలో సహజసిద్ధంగా ఉన్న పర్యాటక వనరులలో ఒకటిగా పరిగణించబడుతోంది. ఈ ప్రకృతి వైభవాన్ని సమర్థవంతంగా అభివృద్ధి చేసి సద్వినియోగం చేస్తే 2029 నాటికి పర్యాటక రంగంలో సుమారు 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించగలమని కూటమి ప్రభుత్వ లక్ష్యంగా నిర్ణయించింది. ఈ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి.

వివరాలు 

పూర్వ వైభవం దిశగా.. 

ఆకివీడు మండలం దుంపగడపలో ఉన్న కాటన్ పార్క్‌ను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య విధానంలో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి రంగం సిద్ధంగా ఉంది. ఇక్కడ గతంలో పనిచేస్తున్న రెస్టారెంట్‌ను పునఃప్రారంభించేందుకు చర్యలు చేపట్టారు. ఉప్పుటేరు ప్రాంతంలో బోటింగ్ సౌకర్యాన్ని కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ నెల 15 నాటి తర్వాత పనులు ప్రారంభించి ఆధునిక వసతులతో కూడిన రెస్టారెంట్, చిన్నారులకు సరిపడిన పార్క్, ఫంక్షన్ హాల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఇక నరసాపురం వలంధర రేవులో ఉన్న రెస్టారెంట్‌ను ప్రైవేట్‌కు లీజుకు ఇచ్చి,అక్కడ గ్రిల్స్ ఏర్పాట్లు చేయడమే కాక చిన్న చిన్న మరమ్మతులు చేసి నదీ విహారానికి పడవలను కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈసదుపాయాలు ఈ నెల 25 నుంచి పర్యాటకుల కోసం అందుబాటులోకి తెస్తున్నారు.

వివరాలు 

గృహాల్లో ఆతిథ్యం 

నరసాపురం సమీపంలోని పీచుపాలెం, సీతారామపురం, లక్ష్మణేశ్వరం వంటి గ్రామాల్లో పర్యాటకులు బస చేసుకోవడానికి అనుకూలంగా 18 ఇళ్లను ఎంపిక చేశారు. ఈ ఇళ్ల యజమానులకు ఇటీవల కోనసీమ జిల్లాలోని దిండిలో తొలి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పర్యాటకులను ఆహ్వానించడం, ఆన్‌లైన్ బుకింగ్‌లు, వివిధ పర్యాటక యాప్‌ల ద్వారా సేవలందించడం వంటి అంశాల్లో వారికి ప్రాక్టికల్ శిక్షణ ఇచ్చారు. ఫలితంగా నరసాపురం ప్రాంతంలో మొత్తం 18 కుటుంబాలకు స్థిర ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి.

వివరాలు 

గృహాల్లో ఆతిథ్యం 

తదుపరి చర్యగా, కాళ్ల, ఉండి, పోడూరు మండలాల్లో ఎంపిక చేసిన ఇళ్ల యజమానులకు రెండో విడత శిక్షణను భీమవరంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై జిల్లా పర్యాటకశాఖ అధికారి అడబాల వెంకట అప్పారావు స్పందిస్తూ, "దుంపగడప, నరసాపురం ప్రాంతాల్లో పర్యాటక ప్రాజెక్టులను ప్రైవేట్ లీజుకు ఇచ్చాం. త్వరలోనే ఈ ప్రాజెక్టులు పర్యాటకులకు అందుబాటులోకి వస్తాయి" అని తెలిపారు.