Page Loader
Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత
రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత

Poison gas leak : రాయల్ మెరైన్ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌లో విషవాయువు లీక్.. 30 మంది కార్మికులకు అస్వస్థత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 02, 2024
01:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం గోకర్ణమఠంలో రాయల్ మెరైన్ రొయ్యల ప్రాసెసింగ్ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటనలో 30 మంది కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శనివారం ఉదయం కంపెనీలోని పైపులైన్ నుంచి విషవాయువు లీక్ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనివల్ల అక్కడ పని చేస్తున్న కార్మికుల్లో చాలామందికి శ్వాస సమస్యలు, కళ్లలో మండడం, ఎర్రబడటం వంటి లక్షణాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న వెంటనే బాధితులను నిజాంపట్నం, పిట్టవానిపాలెం ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు.

Details

ఈఘటనపై విచారణ ప్రారంభం

అనంతరం మెరుగైన వైద్యం కోసం బాపట్ల, గుంటూరు ఆస్పత్రులకు తరలించారు. ఘటన స్థలంలో మాత్రమే లీకేజీ జరిగిందని అగ్నిమాపక సిబ్బంది ప్రాథమికంగా నిర్ధారించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ విషవాయువు లీకేజీకి యాజమాన్యం నిర్లక్ష్యం కారణమేమో అని పోలీసులు విచారణ ప్రారంభించారు. విషయం తెలుసుకున్న మంత్రి సత్యగాని ప్రసాద్ బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు అదేశాలకు జారీ చేశారు.