Page Loader
ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద రద్దీ 
ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద రద్దీ

ముగిసిన సంక్రాంతి.. హైదరాబాద్‌కు క్యూ పట్టిన జనాలు.. టోల్‌ ప్లాజా వద్ద రద్దీ 

వ్రాసిన వారు Stalin
Jan 17, 2024
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

సంక్రాంతి పండగ ముగిసింది. మూడు రోజుల పాటు కుటుంబ సభ్యులతో పండగను జరుపుకొని, జనాలు హైదరాబాద్ బాటపట్టారు. సూర్యాపేట, ఘట్ కేసర్ టోల్ ప్లాజాల మీదుగా హైదరాబాద్ వెళ్లే వారికి పోలీసులు పలు సూచనలు చేశారు. ఈ రెండు టోల్ ప్లాజాల వద్ద రద్దీ ఉందని, అందుకు ట్రాఫిక్‌లో చిక్కుకొని ఇబ్బందులు పడొద్దని చెబుతున్నారు. సొంత వాహనాల్లో వెళ్లేవారు మరిపెడ-తొర్రూరు-జనగామ రూట్లు.. లేకుంటే వరంగల్ మీదుగా వెళ్లేలా ప్లాన్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. బుధవారం ఉదయం నుంచే విజయవాడ-హైదరాబాద్ టోల్ ప్లాజాకు వాహనాలు క్యూ కట్టాయి. దీంతో టోల్ గేట్లను దాటడానికి కనీసం 30 నిమిషాల సమయం పడుతుంది. ఈ సమయం రానురానూ మరింత పెరగనున్న నేపథ్యంలో పోలీసులు ఈ సూచనలు చేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఖమ్మం పోలీసుల విజ్ఞప్తి