Ballari: బళ్లారి గురుకుల పాఠశాలలో విషాదం.. నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటకలోని బళ్లారిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ గురుకుల పాఠశాల హాస్టల్‌లో నిద్రిస్తున్న తోటి విద్యార్థులపై పదో తరగతి చదువుతున్న ఒక విద్యార్థి కత్తి, ఇనుప రాడ్లతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వార్డెన్, సెక్యూరిటీ సిబ్బందిపై కూడా అతడు దాడి చేశాడు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందిన విద్యార్థి కర్నులు జిల్లాకు చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
Details
కేసు నమోదు చేసిన పోలీసులు
ఘటన అనంతరం జిల్లా పోలీస్ అధికారి డాక్టర్ డి. సుమన్ పెన్నేకర్ పాఠశాలకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను కలిసి సంఘటనకు సంబంధించిన వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.