LOADING...
RTC Driver Shankar Goud: సమ్మె వేళ విషాదం.. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి
సమ్మె వేళ విషాదం.. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి

RTC Driver Shankar Goud: సమ్మె వేళ విషాదం.. నర్సంపేట డిపో ఆర్టీసీ డ్రైవర్‌ శంకర్‌గౌడ్‌ మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 24, 2026
08:23 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ఆర్టీసీ సమ్మె ఉద్రిక్తతల మధ్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఆర్టీసీ డ్రైవర్‌ కోల శంకర్‌గౌడ్‌ (55) చివరకు ప్రాణాలు కోల్పోయారు. 80 శాతానికి పైగా కాలిన గాయాలతో ఆయన అపోలో DRDO ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలో నర్సంపేట ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న శంకర్‌గౌడ్‌, సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయడంపై జరుగుతున్న ఆలస్యానికి నిరసనగా తీవ్ర నిర్ణయం తీసుకున్నారు.

వివరాలు

ఇవాళ తెల్లవారుజామున మృతి

నర్సంపేట బస్టాండ్‌ ఎదుట ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు మార్చారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

Advertisement