LOADING...
Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విషాద ఛాయలు.. 8 మంది మృతి
విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విషాద ఛాయలు.. 8 మంది మృతి

Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విషాద ఛాయలు.. 8 మంది మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 08, 2026
05:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీ విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఎనిమిది మంది మృతి చెందినట్లు సమాచారం వెలువడగా, పలువురు గాయపడినట్లు తెలుస్తోంది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెల్లడిస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఫ్యాక్టరీలో కలకలం రేగింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement