LOADING...
బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్ 
బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో సూడెంట్

బాపట్లలో ఘోరం; 10వ తరగతి విద్యార్థిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన మరో స్టూడెంట్ 

వ్రాసిన వారు Stalin
Jun 16, 2023
01:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలంలోని రాజోలులో దారుణం జరిగింది. 10వ తరగతి విద్యార్థిపై తన స్నేహితుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆ విద్యార్థి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన శుక్రవారం ఉదయం జరిగింది. చనిపోయిన విద్యార్థిని అమర్‌నాథ్‌గా గుర్తించారు. అతను రాజోలులోని పాఠశాలలో చదువుతున్నాడు. ఉప్పల అమర్‌నాథ్‌ ట్యూషన్‌ క్లాస్‌కు వెళుతుండగా రెడ్లపాలెం వద్ద ఈ ఘటన జరిగినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

బాపట్ల

ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి

అమర్‌నాథ్‌ ట్యూషన్‌ కి వెళ్తుండగా అతని స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డితో పాటు మరికొందరు వ్యక్తులు అడ్డుకున్నారు. అనంతరం అమర్‌నాథ్‌‌పై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. ఆ తర్వాత వెంకటేశ్వరరెడ్డి, అతని సహచరులు అక్కడి నుంచి పరారయ్యారుని చెరుకుపల్లి సీనియర్ ఇన్‌స్పెక్టర్ కొండా రెడ్డి. బాలుడి అరుపులు విన్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. తీవ్రమైన కాలిన గాయాలైన అమర్‌నాథ్‌‌ను గుంటూరులోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. అయితే అతను చికిత్స పొందుతూ మరణించాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు నిందితులపై కేసులు నమోదు చేసినట్లు సీనియర్ ఇన్‌స్పెక్టర్ కొండా రెడ్డి వెల్లడించారు.