Page Loader
Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ 
Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ

Telangana: తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లు, 132మంది తహసీల్దార్ల బదిలీ 

వ్రాసిన వారు Stalin
Feb 10, 2024
09:10 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ శాఖలో భారీగా బదిలీలను చేపట్టింది. తెలంగాణ వ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు స్థాన చలనం కలిగిస్తూ..రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో పలువురికి ప్రమోషన్లతో పాటు బదిలీ కల్పించారు. ఇంకొందరు డిప్యూటీ కలెక్టర్లను వెయిటింగ్‌లో ఉంచారు. అలాగే 132 మంది తహసీల్దార్లను కూడా ప్రభుత్వం బదిలీ చేసింది. మల్టీజోన్‌-1లో 84 మంది బదిలీ కాగా.. మల్టీజోన్‌-2లో 48మంది ట్రాన్స్‌ఫర్ అయ్యారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు తహసీల్దార్లను బదిలీ చేశారు. ఈ క్రమంలో మరికొన్ని కొన్ని బదిలీలు ఉండే అవకాశం ఉంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఈసీ ఆదేశాల మేరకు బదిలీలు