LOADING...
Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!
భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!

Transfers of Teachers: భవిష్యత్‌లో ఉపాధ్యాయుల బదిలీలు.. కొత్త చట్టం దిశగా మార్గనిర్దేశాలు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 07, 2025
03:33 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల్లో వారి పనితీరును ప్రోత్సహించే పాయింట్లను ఇచ్చే ప్రణాళికను పాఠశాల విద్యాశాఖ అమలు చేయాలని యోచిస్తోంది. త్వరలో ఈ వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వం చట్టాన్ని రూపొందించనుంది. ఈ చట్టం వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇందులో ఉపాధ్యాయుల పనితీరును ప్రోత్సహించేందుకు పాయింట్ల అంశం చేర్చేందుకు కసరత్తు జరుగుతోంది.

Details

అకడమిక్‌ సంవత్సరాల ప్రకారం బదిలీ విధానం

1) ఉపాధ్యాయుల సర్వీసును అకడమిక్ సంవత్సరాల ప్రకారమే పరిగణనలోకి తీసుకుంటారు. కనీసం రెండేళ్ల సర్వీసు ఉన్నప్పుడు మాత్రమే వారు బదిలీ దరఖాస్తు చేయగలుగుతారు. 2) ఒకే స్థలంలో ఎనిమిది సంవత్సరాలు పనిచేసినప్పుడు తప్పనిసరిగా బదిలీ చేస్తారు. 3) ప్రధానోపాధ్యాయులకు 2, 5 సంవత్సరాల కాలవ్యధి అమలు చేయనున్నారు. 4) మే 31 నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా బదిలీలు చేయనున్నారు. 5) ఈ చట్టం అమల్లోకి వస్తే, ఏప్రిల్, మే నెలల్లో మాత్రమే బదిలీలు జరుగుతాయి, మధ్యలో టీచర్లను బదిలీ చేయడం సాధ్యం కాదని పేర్కొంటున్నారు. 6) రాష్ట్రంలోని పాఠశాలలను ఏ, బీ, సీ, డీ విభాగాలుగా విభజించారు. కేటగిరీ - డీ బడులు ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నాయి.

Details

 ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అభిప్రాయాల సేకరణ 

1) ఉత్తర్వులు-117 రద్దు చేసి, దాని స్థానంలో తాత్కాలికంగా మెమో జారీ చేయనున్నారు. ఇందులో క్షేత్రస్థాయి నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. 2) వైసీపీ ప్రభుత్వ హయాంలో విలీనమైన 3, 4, 5 తరగతులను వెనక్కి తీసుకొంటారు. వాటిని ఆయా గ్రామాల్లోని ప్రధాన పాఠశాలల్లో కలిపి నిర్వహిస్తారు. 3) గ్రామ పంచాయతీకి ఒక మోడల్ ప్రాథమిక పాఠశాల ఏర్పాటుచేసి, తరగతికో టీచర్‌ను ఇవ్వనున్నారు. 4) ప్రతి పాఠశాలను కొనసాగిస్తూ, పూర్వ ప్రాథమిక విద్య-1, 2తో పాటు 1, 2 తరగతులను కలిపి ఫౌండేషన్ బడులుగా నిర్వహిస్తారు. 5) ఈ ఉత్తర్వుల తర్వాత ఉపాధ్యాయ పోస్టులను సర్దుబాటు చేసి, బదిలీలు చేపడతారు.