తదుపరి వార్తా కథనం
Justice Amarnath Goud: త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అరుదైన రికార్డు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Nov 16, 2024
04:12 pm
ఈ వార్తాకథనం ఏంటి
త్రిపుర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అమర్నాథ్ గౌడ్ అత్యధిక కేసులు పరిష్కరించి సంచలన రికార్డును సృష్టించారు.
ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును గుర్తించిన తెలంగాణ గవర్నర్ శనివారం ఆయనకు పురస్కారం అందజేశారు.
2017 నుండి ఇప్పటివరకు, జస్టిస్ గౌడ్ 92 వేల కేసులు పరిష్కరించి 'యూకే వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా స్థానం సంపాదించుకున్నారు.
జస్టిస్ అమర్నాథ్ గౌడ్ న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించిన తర్వాత 2017లో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
Details
92 వేల కేసులకు పరిష్కారం
ఆ తర్వాత త్రిపుర హైకోర్టుకి బదిలీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన తన బెంచ్‌లో పెండింగ్ ఉన్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు కట్టుబడినట్లు తెలిపారు.
హైదరాబాద్ వాసి అయిన జస్టిస్ గౌడ్ న్యాయసేవలో ఇలాంటి గుర్తింపు పొందడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.