LOADING...
MEA: భారత్ రష్యా చమురు కొనుగోలు చేయద్దన్న ట్రంప్.. స్పందించిన విదేశాంగశాఖ
భారత్ రష్యా చమురు కొనుగోలు చేయద్దన్న ట్రంప్.. స్పందించిన విదేశాంగశాఖ

MEA: భారత్ రష్యా చమురు కొనుగోలు చేయద్దన్న ట్రంప్.. స్పందించిన విదేశాంగశాఖ

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 05, 2026
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులు రష్యా నుంచి నిలిపివేసి, అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు. ఈ అంశంపై భారత విదేశాంగశాఖ స్పందించింది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రత ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనదని, చమురు కొరకు తీసుకునే నిర్ణయాల్లో ఇది ప్రాధాన్యమని స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, గ్లోబల్ పరిణామాలను బట్టి వివిధ సరఫరాదారులను ఆశ్రయించడం ప్రభుత్వ వ్యూహంలో భాగమని కూడా తెలిపింది.

వివరాలు 

వెనెజువెలా చాలా కాలంగా భారత్‌ భాగసామ్య దేశం

"వాణిజ్యం, పెట్టుబడుల రంగాల్లో వెనెజువెలా చాలా కాలంగా భారత్‌ భాగసామ్య దేశంగా ఉంది. గతంలో ఆ దేశం నుంచి చమురు, ఇతర ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాం. ఇంధన భద్రతకు అనుగుణంగా వెనెజువెలా సహా ఏ దేశం నుంచైనా ముడిచమురు కొనుగోలు చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం" అని విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జయస్‌వాల్‌ ఓ మీడియా సమావేశంలో చెప్పారు అమెరికా (USA)తో వాణిజ్య ఒప్పందం దేశ ఎగుమతులు, పరిశ్రమల అభివృద్ధి, ఉద్యోగాల సృష్టి, ప్రజల సంక్షేమానికి ప్రేరణగా ఉంటుందని కూడా తెలిపారు.

వివరాలు 

ఇరాన్‌లో సుమారు 10 వేల మంది ప్రవాస భారతీయులు

ఇక ఇటీవలి ఇరాన్‌ ఆందోళనల సందర్భంలో అక్కడ ఉన్న భారతీయులు మృతి చెందినట్లు, తప్పిపోయారనే ఏ నివేదికలు కేంద్ర ప్రభుత్వం వద్ద లేవని వెల్లడించింది. పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు పార్లమెంటుకు తెలియజేసింది. టెహ్రాన్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక భారత పౌరులతో నిత్యసంప్రదింపుల్లో ఉందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ రాజ్యసభకు ఇచ్చిన లిఖిత సమాధానంలో పేర్కొన్నారు. తాజా అంచనాల ప్రకారం, ఇరాన్‌లో సుమారు 10 వేల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు.

Advertisement