Loading...
Trump: అమెరికన్లకు ట్రంప్ భారీ ఆఫర్.. గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు
అమెరికన్లకు ట్రంప్ భారీ ఆఫర్.. గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు

Trump: అమెరికన్లకు ట్రంప్ భారీ ఆఫర్.. గెలిపిస్తే ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2026
02:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన హామీ ఇచ్చారు. నవంబరులో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ ప్రతినిధుల సభ, సెనేట్‌పై పూర్తి ఆధిపత్యం సాధిస్తే.. ప్రతి వయోజన అమెరికన్‌కు 5,000 డాలర్లు చెల్లిస్తామని వెల్లడించారు. డలాస్‌లో నిర్వహించిన పార్టీ సమావేశంలో ట్రంప్‌ ఈ ప్రకటన చేశారు. ఈ నగదు పంపిణీ పథకాన్ని 'ట్రంప్‌ డివిడెండ్‌'గా అభివర్ణించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం బలంగా ఉందని ట్రంప్‌ పేర్కొన్నారు. దేశం సాధిస్తున్న విజయాల్లో ప్రజలకు కూడా వాటా కల్పించాలన్న ఉద్దేశంతోనే ఈ పథకాన్ని ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. అయితే ఈ మొత్తాన్ని అమెరికాలోనే ఖర్చు చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

వివరాలు 

24 కోట్ల నుంచి 27 కోట్ల మంది వరకు వయోజనులు

అయితే ఈ హామీని ఎలా అమలు చేస్తారనే దానిపై ట్రంప్‌ పూర్తి వివరాలు వెల్లడించలేదు.

ఈ పథకానికి అవసరమైన నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తారు? నగదును ఎప్పుడు చెల్లిస్తారు? ఈ ప్రయోజనానికి ఎవరు అర్హులు? వంటి అంశాలపై స్పష్టత ఇవ్వలేదు.

అమెరికాలో సుమారు 24 కోట్ల నుంచి 27 కోట్ల మంది వరకు వయోజనులు ఉన్నట్లు అంచనా.

వీరందరికీ 5,000 డాలర్ల చొప్పున అందిస్తే ప్రభుత్వంపై భారీ ఆర్థిక భారం పడే అవకాశం ఉంది.

దీంతో ప్రభుత్వ లోటు, ద్రవ్యోల్బణంపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుందనే చర్చ మొదలైంది.

వివరాలు 

అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారిన హామీ

నవంబర్‌ మధ్యంతర ఎన్నికలకు ముందు ట్రంప్‌ ప్రకటించిన ఈ హామీ అమెరికా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

ఇంత పెద్ద మొత్తాన్ని ప్రజలకు పంపిణీ చేయడంపై ఆర్థిక నిపుణులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు.

మరోవైపు.. మధ్యంతర ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించేందుకే ట్రంప్‌ ఈ హామీ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT