Modi-Trump: మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..?
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతల మధ్య కీలక అంశాలపై విస్తృతంగా చర్చ జరిగినట్టు సమాచారం. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి పరిస్థితి, అలాగే పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలపై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ విషయాన్ని భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెర్గియో గోర్ చేసిన ట్వీట్
President Donald Trump just spoke with Prime Minister Modi. They discussed the ongoing situation in the Middle East, including the importance of keeping the Strait of Hormuz open.
— Ambassador Sergio Gor (@USAmbIndia) March 24, 2026
వివరాలు
ప్రస్తుత పరిస్థితులపై చర్చ
ఇక ఇటీవల జరిగిన పరిణామాల విషయానికి వస్తే... గత నెల 28న ఇరాన్‌పై ఇజ్రాయెల్,అమెరికా కలిసి సంయుక్త దాడులు చేపట్టాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందినట్లు సమాచారం వెలువడింది. ఈ సంఘటన అనంతరం ఇరాన్ తీవ్రంగా ప్రతిస్పందిస్తూ ప్రతీకార దాడులకు దిగింది. ప్రత్యేకంగా గల్ఫ్ ప్రాంతంలోని ఇంధన క్షేత్రాలపై క్షిపణి దాడులు జరిపింది. అంతేకాకుండా అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిని మూసివేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. ఈ చర్యల కారణంగా అంతర్జాతీయ స్థాయిలో చమురు,సహజ వాయువు సరఫరాలో అంతరాయం ఏర్పడి, అనేక దేశాల్లో ఇంధన సంక్షోభం నెలకొంది. ఈ క్లిష్ట పరిస్థితుల్లోనే ట్రంప్, ప్రధాని మోదీతో ఫోన్ ద్వారా మాట్లాడి ప్రస్తుత పరిస్థితులపై చర్చించారు.