LOADING...
PM Modi: ఛాట్ పూజ‌కు యునెస్కో వార‌స‌త్వ సంప‌ద గుర్తింపు తెస్తాం: మోదీ 
ఛాట్ పూజ‌కు యునెస్కో వార‌స‌త్వ సంప‌ద గుర్తింపు తెస్తాం: మోదీ

PM Modi: ఛాట్ పూజ‌కు యునెస్కో వార‌స‌త్వ సంప‌ద గుర్తింపు తెస్తాం: మోదీ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 30, 2025
12:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

బీహారీ ప్రజలు ఎంతో ఆత్మీయంగా జరుపుకునే ఛఠ్ పూజకు యునెస్కో వారసత్వ గుర్తింపు తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో ఈరోజు ముజఫర్‌పూర్‌లో జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. ప్రధాని మాట్లాడుతూ,బీహారీ ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఛఠ్ పూజను నిర్వహిస్తారని,కానీ కాంగ్రెస్ పార్టీ ఈపవిత్ర పండుగను అవమానపరుస్తోందని విమర్శించారు. తమప్రభుత్వం మాత్రం ఛఠ్ పూజకు యునెస్కోవారసత్వ గుర్తింపు లభించేందుకు కృషి చేస్తోందని తెలిపారు. అలాగే,ఓట్లకోసం ఛఠ్ ఉత్సవాన్ని కాంగ్రెస్,ఆర్జేడీలు అవమానిస్తున్నాయని ఆయన అన్నారు. రైల్వేవ్యవస్థను దోచుకున్న వారు బీహార్ అభివృద్ధి గురించి ఎలా మాట్లాడగలరని ప్రశ్నించారు. బీహార్‌లో ఒకప్పుడు'జంగిల్ రాజ్'నడిచిందని,ఆసమయంలో ఆర్జేడీ గుండాలు షోరూమ్‌లకు వెళ్లి వాహనాలను బలవంతంగా తీసుకెళ్లేవారని ఆరోపించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఛాట్ పూజ‌కు యునెస్కో వార‌స‌త్వ సంప‌ద గుర్తింపు తెస్తాం