TS DSC (TRT) Notification 2023: నేటి నుంచే టీచర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం
సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ), స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, పీఈటీ మొదటైన 5089 టీచర్ పోస్టులను డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్(టీఎస్ డీఎస్సీ 2023) ద్వారా భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఎస్ టీఆర్‌టీ 2023) ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ బుధవారం ( సెప్టెంబర్ 20వ తేదీ)న ప్రారంభమైంది. దరఖాస్తుకు చేసుకోవడానికి అక్టోబర్ 21 చివర తేదీ అని ప్రభుత్వం నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆన్‌లైన్ పరీక్షను నవంబర్ 20 నుండి నవంబర్ 30 మధ్య నిర్వహించనున్నారు. ఈ https://schooledu.telangana.gov.in/ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా TSDSC రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను పూర్తిగా చూడవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి?
ముందుగా, అభ్యర్థులు schooledu.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. హోమ్ పేజీలో ఇచ్చిన MPHA ఫిమేల్ రిక్రూట్‌మెంట్ దరఖాస్తు లింక్‌పై క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అడిగిన సమాచారాన్ని పొందుపర్చాలి. మీ స్కాన్ చేసిన పత్రాలను అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత ఫీజు చెల్లించాలి. ఆపై చివరగా సబ్మిట్‌పై క్లిక్ చేయండి. దరఖాస్తు పూర్తైన తర్వాత రసీదుని డౌన్‌లోడ్ చేసుకోవాలి. TS TRT ఖాళీల వివరాలు: స్కూల్ అసిస్టెంట్లు -1739 సెకండరీ గ్రేడ్ టీచర్లు (SGT)- 2575 భాషా పండిట్- 611 ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (PET)- 164