Page Loader
TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

TS KGBV Recruitment 2023: కస్తూర్బా విద్యాలయాల్లో 1241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 

వ్రాసిన వారు Stalin
Jun 19, 2023
04:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ రాష్ట్రాలలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(TS KGBV), అర్బన్ రెసిడెంట్ స్కూల్స్ (URS)లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకానికి కమిషనర్ అండ్ డైరెక్టరేట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు జూన్ 26, 2023 నుంచి అధికారిక వెబ్‌సైట్ schooledu.telangana.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కేజీబీవీలు, యూఆర్ఎస్‌లో కలిపి మొత్తం 1241 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించింది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జూలై నెలలో పరీక్షలు నిర్వహిస్తారు.

ఉద్యోాగాలు

రిక్రూట్‌మెంట్ కోసం ఇలా దరఖాస్తు చేసుకోవాలి

1: మొదట అధికారిక వెబ్‌సైట్‌ను schooledu.telangana.gov.in ను సందర్శించండి. 2: హోమ్‌పేజీలో కనపడే కేజీబీవీ, యూఆర్ఎస్‌లో రిక్రూట్‌మెంట్ 2023 అని ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. 3: అడిగిన వివరాలను నమోదు చేయాలి. తర్వాత ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. 4: ఇప్పుడు దరఖాస్తు ఫారమ్‌ను పూర్తిగా నింపాలి. అనంతరం దరఖాస్తు రుసుమును చెల్లించాలి. 5: ఆ తర్వాత దరఖాస్తు ఫారమ్‌ను సబ్మిట్ చేయాలి. అనంతరం భవిష్యత్ అవసరాల కోసం ప్రింటవుట్ తీసుకోవాలి. 6. పోస్టింగ్ పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. 7. కేజీబీవీల్లోని పోస్టులకు మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.