Page Loader
TS Ministers: సీఎం రేవంత్‌‌, డిప్యూటీ సీఎం భట్టితో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే
మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదేv

TS Ministers: సీఎం రేవంత్‌‌, డిప్యూటీ సీఎం భట్టితో మరో 10 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం.. జాబితా ఇదే

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Dec 07, 2023
10:45 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ఎల్బీస్టేడియంలో రేవంత్‌ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు ఇప్పటికే ఏఐసీసీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దారామయ్య హాజరుకానున్నారు. ఈ సందర్భంగా రేవంత్‌తో పాటు పలువురు సీనియర్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో తెలంగాణ మంత్రుల జాబితాను పార్టీ హైకమాండ్ తాజాగా విడుదల చేసింది. తెలంగాణ కేబినెట్‌లో చోటు కల్పించిన మంత్రుల జాబితాను కాంగ్రెస్ నేతలు ఇప్పటికే రాజ్‌భవన్‌కు అందజేశారు.

details

ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితా ఇదే :

నూతన మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణకు ఒకే ఒక ఉప ముఖ్యమంత్రి ఉండనున్నారు. భట్టి విక్రమార్కకు ఉపముఖ్యమంత్రి పదవి ఇస్తూ కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం సహా మొత్తం 12 మంది ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే.. భట్టి విక్రమార్క, ఏకైక డిప్యూటీ సీఎం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి శ్రీధర్ బాబు దామోదర రాజనర్సింహ కొండా సురేఖ జూపల్లి కృష్ణ రావు ఉత్తమ్ కుమార్‌ రెడ్డి పొన్నం ప్రభాకర్ సీతక్క తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి