Page Loader
Tet -Telanagana-Date Extended: టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ
టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ

Tet -Telanagana-Date Extended: టెట్ దరఖాస్తుల గడువు పొడిగించిన తెలంగాణ

వ్రాసిన వారు Stalin
Apr 10, 2024
06:40 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువును పొడిగించింది. టెట్ కు దరఖాస్తుకు బుధవారం తో గడువు ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం గడువును పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 20 వరకు టెట్ అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. టెట్ కోసం మంగళవారం సాయంత్రం వరకు 1.93 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈ సారి టెట్ కు తక్కువ దరఖాస్తులు వచ్చాయి. ఈ మధ్య కాలంలో బీఈడీ చేసే వారి సంఖ్య క్రమేణా తగ్గిపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. 2016లో 3.40లక్షల దరఖాస్తులు వచ్చాయి. 2017లో 3.29 లక్ష దరఖాస్తులు, 2022లో 3.79 లక్షలు, 2023లో 2.83లక్షల దరఖాస్తులు వచ్చాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

టెట్‌ దరఖాస్తుల గడువు పెంపు