Page Loader
ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 
ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఆన్‌లైన్‌లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టిక్కెట్లు: ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి 

వ్రాసిన వారు Stalin
Jun 04, 2023
10:09 am

ఈ వార్తాకథనం ఏంటి

జూన్ 11న జరగనున్న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టిక్కెట్లు ఆదివారం విడుదల చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ ) ప్రకటించింది. హాల్ టిక్కెట్లు https://www.tspsc.gov.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అక్టోబర్ 16, 2022న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష కోసం ముందుగా జారీ చేయబడిన హాల్ టిక్కెట్లు, తరువాత రద్దు చేసినట్లు, జూన్ 11న జరగబోయే పరీక్షకు చెల్లుబాటు కావని పేర్కొంది. అభ్యర్థులు కొత్తగా డౌన్‌లోడ్ చేసుకోవాలని చెప్పింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 1 ఉద్యోగాల కోసం 3,80,202 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష నిర్వహణకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసినట్లు టీఎస్‌పీఎస్సీ పేర్కొంది.

తెలంగాణ

గ్రూప్-1 హాల్ టికెట్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ tspsc.gov.in లోకి లాగిన్ అవ్వాలి. అధికారిక లింక్‌కి నావిగేట్ చేసి, నోటిఫికేషన్ బార్‌పై క్లిక్ చేయాలి. తర్వాత గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష హాల్ టికెన్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి. హాల్ టికెన్‌ డౌన్‌లోడ్ అయిన తర్వాత, పరీక్ష తేదీకి సంబంధించిన సూచనలను ఒకసారి చదవండి. గ్రూప్ 1 సిలబస్, పరీక్షా సరళి, సిలబస్ అంశాలు, ఇతర ముఖ్యమైన సూచనలను తనిఖీ చేసుకోండి.