Page Loader
టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ
టీఎస్‌పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ జారీ

టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. సంక్షేమ హాస్టళ్లలో 581 ఖాళీల భర్తీ

వ్రాసిన వారు Stalin
Dec 24, 2022
05:11 pm

ఈ వార్తాకథనం ఏంటి

సంక్షేమ హాస్టళ్లలో ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) నోటిఫికేషన్ జారీ చేసింది. తాజాగా నోటిఫికేషన్ ద్వారా 581 ఖాళీలను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది. హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-1, 2, మాట్రాన్ గ్రేడ్-1, 2, వార్డెన్ గ్రేడ్-1, 2తో పాటు మహిళా సూపరింటెండెంట్ పోస్టుల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 6 నుంచి జనవరి 27 సాయంత్రం 5గంటల లోపు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. ఈ నోటిఫికేషన్‌లో అత్యధికంగా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి విభాగంలో ఉన్నాయి. ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్ విభాగంలో 228 గ్రేడ్ -2( పురుషులు) పోస్టులను టీఎస్‌పీఎస్సీ భర్తీ చేయనుంది.

టీఎస్‌పీఎస్సీ

పోస్టుల వివరాలు ఇలా..

ట్రైబ‌ల్ వెల్ఫేర్‌లో గ్రేడ్ -2: 106 ఎస్సీ డెవ‌ల‌ప్‌మెంట్‌ విభాగంలో గ్రేడ్ -2 (మ‌హిళ‌లు) : 70 బీసీ వెల్ఫేర్ విభాగంలో గ్రేడ్ -2 : 140 వార్డెన్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 03 మ్యాట్ర‌న్ గ్రేడ్ -2 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 02 ట్రైబ‌ల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1: 05 వార్డెన్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిస‌బుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 05 మహిళా లేడి సూప‌రింటెండెంట్, చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ : 19 మ్యాట్ర‌న్ గ్రేడ్ -1 డైరెక్ట‌ర్ ఆఫ్ డిసేబుల్డ్ సీనియ‌ర్ సిటిజెన్స్ వెల్ఫేర్ : 03