TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత వైఫై సేవలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోకి ప్రయాణికుల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు అందుబాటులో తెచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతానికి ఫ్రీ వైఫై సేవలు కొన్ని బస్సుల్లోనే తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మొదటి విడత కింద 16ఏసీ స్లీపర్ బస్సుల్లో టీఎస్ఆర్టీసీ ఫ్రీ వైఫై సేవలను అందుబాటులోకి తెచ్చారు.
ప్రస్తుతానికి హైదరాబాద్ నుంచి ఇతర రాష్ట్రాలకు నడిచే స్లీపర్ బస్సుల్లో మాత్రమే ఫ్రీ వైఫై సేవలను అందిస్తారు.
ఈ 16స్లీపర్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఇటీవలే ప్రారంభించింది. వీటిలో చాలా అత్యాధినిక సౌకర్యాలు ఉన్నాయి.
ఈ బస్సుల లొకేషన్‌ను చేయడానికి ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. అలాగే ఈ బస్సులను కంట్రోల్ రూమ్‌కు అనుసంధానించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చేసిన ట్వీట్
Wifi in TSRTC..
— Team Road Squad🚦🚴♀️ (@Team_Road_Squad) September 6, 2023
Every initiative contributes to the betterment of society.#TSRTC.
GAMYAM app link: https://t.co/oz9A95ALbI@SajjanarVC @tsrtcmdoffice @shilpavallik @TSRTCHQ pic.twitter.com/6457OYvAV3