Medaram jatara: నేటి నుంచి మేడారం జాతరం కోసం 6,000 స్పెషల్ బస్సులు
మేడారం జాతర కోసం టీఎస్‌ఆర్‌టీసీ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులను ఆదివారం ప్రారంభించింది. ఫిబ్రవరి 18- 25 మధ్య దాదాపు 6వేల బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్‌టీసీ ప్రకటించింది. మంత్రి సీతక్క మేడారంలో 55ఎకరాల విస్తీర్ణంలో బస్సులు ఉండేలా తాత్కాలిక బస్టాండ్‌ను శనివారం ప్రారంభించారు. మేడారం జాతర ఫిబ్రవరి 21- 24 వరకు ఉన్నప్పటికీ.. ఆదివారం నుంచే ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు TSRTC మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ తెలిపారు. మహాలక్ష్మి పథకం కారణంగా ఎక్కువ మంది మహిళలు హాజరయ్యే అవకాశం ఉన్నందున అదనపు ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. 6,000 బస్సుల్లో 1,600 హైదరాబాద్ నుంచి రాగా, మిగిలినవి మహబూబ్‌నగర్, నల్గొండ, మెదక్, రంగారెడ్డి రీజియన్‌ల నుంచి రానున్నట్లు సమాచారం.