NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ
    తదుపరి వార్తా కథనం
    గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ
    గోవిందకోటి రాస్తే వీఐపీ బ్రేక్ దర్శనం ఫ్రీ

    గోవిందకోటి రాస్తే తిరుమల శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం ఉచితం.. నేటి నుంచే భక్తులకు చేతి కర్రల పంపిణీ

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 06, 2023
    12:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టీటీడీ పాలక మండలి సంచలన నిర్ణయాలు ప్రకటించింది. యువతలో సనాతన ధర్మం, హైందవ ధర్మవ్యాప్తి చేసేందుకు ప్రత్యేకంగా పలు కార్యక్రమాలను తీసుకువచ్చేందుకు నిర్ణయించింది.

    ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన పాలక మండలిలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

    యువతలో భక్తి భావాన్ని పెంపొందించేందుకు 25 ఏళ్లలోపు యువత, కోటి గోవింద నామాలు రాసిన వారితో పాటు కుటుంబం మొత్తానికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పించేందుకు టీటీడీ తీర్మానించింది.

    అంతేకాకుండా, 10,01,116 సార్లు గోవింద నామాలు‌ రాసిన వ్యక్తికి స్వామివారి బ్రేక్ దర్శనం కల్పించేందుకు టీటీడీ నిర్ణయించింది.

    ఎల్‌కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఉచితంగా 20 పేజీలున్న కోటి భగవద్గీత పుస్తకాలను శ్రీవారి ప్రసాదంగా అందించనున్నారు.

    DETAILS

    కర్రలు చేతిలో ఉంటే చిరుత, ఎలుగుబంటి వస్తే తరిమికొట్టొచ్చు : భూమన

    తిరుమలకు నకడ మార్గంలో వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేపడుతోందని ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి వెల్లడించింది. ఈ మేరకు పటిష్ట భద్రతను కల్పిస్తున్నామన్నారు.

    ప్రతీ ఒక్కరికి ఇవాళ్టి నుంచి చేతికర్రలు అందిస్తున్నామని, కర్రలు చేతిలో ఉంటే చిరుత, ఎలుగుబంటి వస్తే తరిమికొట్టేందుకు ఊతంగా ఉంటుందన్నారు. అనంతరం ఎన్ఎస్ ఆలయం వద్ద తిరిగి తీసుకోనున్న తెలిపారు.

    సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను భూమన తప్పుబట్టారు. సనాతన ధర్మం అంటే మతం కాదని, అది ఒక జీవనయానమన్నారు.

    ప్రతి దేశానికి ఓ సంస్కృతి, సంప్రదాయం ఉంటుందన్నారు. సమాజంలో అలజడిని సృష్టించేందుకే ఇలాంటి వ్యాఖ్యలు పనికొస్తాయి తప్ప ఉద్దరించేందుకు కాదని చెప్పుకొచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తిరుమల తిరుపతి దేవస్థానం

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    తిరుమల తిరుపతి దేవస్థానం

    నందిని నెయ్యిపై కర్ణాటకలో రాజకీయ దుమారం  కర్ణాటక
    Bhumana Karunakar Reddy: టీటీడీ చైర్మన్‌గా బాధ్యతలను స్వీకరించిన భూమన కరుణాకర్‌రెడ్డి భూమన కరుణాకర్‌ రెడ్డి
    Tirumala: తిరుమలలో విషాదం.. చిరుత దాడిలో చిన్నారి మృతి  తిరుమల తిరుపతి
    తిరుమలలో రోహిత్ శర్మ.. కుటుంబంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న భారత కెప్టెన్ ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025