TTD: జనవరి 2 నుంచి టోకెన్లు లేకున్నా దర్శనానికి అనుమతిస్తాం: తితిదే ఛైర్మన్
ఈ వార్తాకథనం ఏంటి
వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా నిరంతరంగా పనిచేస్తున్నామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. గతంలో ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ప్రత్యేకంగా సబ్ కమిటీలను ఏర్పాటు చేసిందని ఆయన తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ట్రోల్స్, దుష్ప్రచారాలపై స్పందించిన బీఆర్ నాయుడు, టోకెన్లు లేకపోతే తిరుమలకు అనుమతించరన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
వివరాలు
ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు తిరుమలలో వైకుంఠద్వార దర్శనం
ఇలాంటి అపోహలను నమ్మవద్దని భక్తులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తిరుమలకు వచ్చే భక్తులను నిలువరించే హక్కు ఎవరికీ లేదని, అలాంటి పరిస్థితి ఉండదని స్పష్టంచేశారు. టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి ప్రాధాన్యం ఇస్తామని పేర్కొన్న ఆయన, జనవరి 2 నుంచి టోకెన్లు లేని భక్తులకూ దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. అలాగే, ఈ నెల 30 నుంచి వచ్చే నెల 8 వరకు తిరుమలలో వైకుంఠద్వార దర్శనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఛైర్మన్ వివరించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు చేసిన ట్వీట్
వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట
— B R Naidu (@BollineniRNaidu) December 22, 2025
రాష్ట్ర సీఎం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు డిసెంబర్ 30 నుండి జనవరి 8 వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇస్తున్నాం.
10 రోజులలో మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు (దాదాపు 90%)… pic.twitter.com/kYpff2yuj5