Loading...
Andhra Handloom Weavers: రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు
రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు

Andhra Handloom Weavers: రాష్ట్రానికి గర్వకారణం.. ఇద్దరు నేతన్నలకు జాతీయ చేనేత పురస్కారాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2026
01:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

చేనేత రంగంలో విశిష్ట సేవలు అందించిన ఆంధ్రప్రదేశ్'కి చెందిన ఇద్దరు నేతన్నలు ప్రతిష్ఠాత్మక జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికయ్యారు. వెంకటగిరి చీరలకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నక్కా వెంకటేశ్వరరావుతో పాటు, పొందూరు కాటన్‌తో అత్యుత్తమ నాణ్యత కలిగిన జామ్దానీ చీరలను నేస్తూ ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీకాకుళం జిల్లా నేతన్న మురకల నటరాజు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు. వీరికి ఆగస్టు 7న నిర్వహించే 12వ జాతీయ చేనేత దినోత్సవ వేడుకల్లో జాతీయ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు.

వివరాలు 

చేనేతలో విశిష్ట సేవలు 

2025 సంవత్సరానికి గాను 'ఉత్తమ మార్కెటింగ్' విభాగంలో నక్కా వెంకటేశ్వరరావు జాతీయ చేనేత అవార్డుకు ఎంపికయ్యారు.

ఆయన కుటుంబం గత ఆరు దశాబ్దాలుగా చేనేత రంగంలో సేవలందిస్తూ వెంకటగిరి చీరల ఖ్యాతిని దేశ విదేశాలకు చాటుతోంది.

శ్రీకాకుళం జిల్లా అలికాం గ్రామానికి చెందిన మురకల నటరాజు గత 15 ఏళ్లుగా మాస్టర్ వీవర్‌గా సేవలందిస్తున్నారు.

ఆయన ఆధ్వర్యంలో సుమారు 50 మంది మహిళలకు ఉపాధి లభిస్తోంది.

పొందూరు కాటన్‌తో అత్యున్నత నాణ్యత కలిగిన జామ్దానీ చీరలను నేయడంలో ఆయనకు ప్రత్యేక నైపుణ్యం ఉంది.

ఈ విశిష్ట కృషికే జాతీయ స్థాయిలో ఆయనకు గుర్తింపు లభించింది.

ADVERTISEMENT