Page Loader
డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ
డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ

డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో రెండు కంపెనీలు: ఐసీఎంఆర్ డీజీ

వ్రాసిన వారు Stalin
May 16, 2023
04:52 pm

ఈ వార్తాకథనం ఏంటి

డెంగ్యూ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసేందుకు రెండు కంపెనీలు ట్రయల్స్ నిర్వహిస్తున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్(ఐసీఎంఆర్ డీజీ) డాక్టర్ రాజీవ్ బహ్ల్ మంగళవారం తెలిపారు. డెంగ్యూ టీకా పానాసియా l, ll దశలను 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 100 మందిపై ట్రయల్స్ నిర్వహించారు. మూడో దశలో భాగంగా 18 నుంచి 80 సంవత్సరాల వయస్సు గల 10,335 మంది ఆరోగ్యవంతమైన పెద్దలపై రాండమైజ్డ్ ట్రయల్స్, డబుల్ బ్లైండ్, ప్లేసిబో-నియంత్రిత ట్రయల్స్‌ను ప్రారంభించాలని ఐసీఎంఆర్ యోచిస్తోంది.

టీకా

జనవరి 2023లో వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు అనుమతి

డెంగ్యూ వ్యాక్సిన్‌ ట్రయల్స్‌కు జనవరి 2023లో అనుమతులు ఇచ్చారు. వాస్తవానికి మూడు నెలల క్రితం ట్రయల్స్ ఉత్పత్తులను తయారు చేయాల్సిన కంపెనీ చేయలేకపోయిందని రాజీవ్ బహ్ల్ చెప్పారు. అయితే కంపెనీ ఆగస్టులో వాటిని ఉత్పత్తి చేసేందుకు ముందుకు వచ్చిందని, దీంతో ట్రయల్స్ మూడోను చేపట్టబోతున్నట్లు రాజీవ్ బహ్ల్ వెల్లడించారు. ఇప్పటి వరకు తాము వ్యాక్సిన్ సమర్థత గురించి కూడా ఏమీ చెప్పలేమన్నారు.