LOADING...
Amaravati: అమరావతి,అరకులోయలో రూ.377 కోట్లతో రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు.. రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం
రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం

Amaravati: అమరావతి,అరకులోయలో రూ.377 కోట్లతో రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు.. రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 17, 2025
11:24 am

ఈ వార్తాకథనం ఏంటి

ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించబోయే రెండు ఫోర్‌ స్టార్‌ హోటళ్లు,అరకులోయలో ఏర్పాటయ్యే ఒక లగ్జరీ రిసార్ట్‌కు, పర్యాటక విధానం 2024-29 ప్రకారం రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అమరావతిలో,సదరన్‌ గ్లోబ్‌ హోటల్‌ సంస్థ రూ.176.96 కోట్లతో ఏర్పాటు చేయబోయే ఫోర్‌ స్టార్‌ హోటల్‌ ద్వారా ప్రత్యక్షంగా,పరోక్షంగా సుమారు 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అంతే కాక, 'దసపల్లా అమరావతి హోటల్‌ సంస్థ' రూ.200 కోట్లతో ఏర్పాటు చేయబోయే మరో ఫోర్‌ స్టార్‌ హోటల్‌ ద్వారా ప్రత్యక్షంగా 400 మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని అంచనా. అరకులోయలో, 'వీఎస్‌కే హోటల్ & రిసార్ట్స్‌' రూ.55.84 కోట్లతో నిర్మించబోయే లగ్జరీ రిసార్ట్‌ ద్వారా ప్రత్యక్ష,పరోక్షంగా 198 మందికి ఉపాధి లభించనుంది.

వివరాలు 

 ఉత్తర్వులు జారీ చేసిన అజయ్‌జైన్‌ 

ఈ నెల 8న జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో, ఈ ఫోర్‌ స్టార్‌ హోటళ్లు, లగ్జరీ రిసార్ట్‌ ప్రతిపాదనలు ఆమోదించడమే కాక, పర్యాటక విధానంలో రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ రాయితీలు ఎస్‌జీఎస్‌టి, కేపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్ వంటి అంశాలపై కల్పిస్తారు. రాష్ట్ర పర్యాటకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్‌ ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.