Air India pilots: ఎయిర్ ఇండియాకు మరో షాక్.. డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు పైలట్లకు పాజిటివ్
ఈ వార్తాకథనం ఏంటి
డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లు విఫలమయ్యారు. ప్రాథమికంగా నిర్వహించిన పరీక్షల్లో ఈ విషయం బయటపడింది. అయితే తుది పరీక్ష ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరు పైలట్లను ఎయిరిండియా తాత్కాలికంగా విధుల నుంచి పక్కనపెట్టినట్లు వెల్లడించాయి. ఇటీవల ఫుకెట్ నుంచి దిల్లీకి వచ్చిన ఎయిరిండియా విమానంలో ఓ పైలట్‌కు నిర్వహించిన డోప్ టెస్టు పాజిటివ్‌గా వచ్చినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ ఘటనపై చర్చ జరుగుతున్న సమయంలోనే తాజాగా మరో ఇద్దరు పైలట్లు డ్రగ్స్ పరీక్షలో విఫలమైనట్లు సమాచారం వెలుగులోకి రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. తుది పరీక్ష ఫలితాలు వచ్చిన తర్వాతే ఈ వ్యవహారంపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డ్రగ్స్ పరీక్ష.. మరో ఇద్దరు ఎయిరిండియా పైలట్లు ఫెయిల్
Two more Air India pilots fail drug test after Phuket flight mid-air incident: Reporthttps://t.co/nAaVVJhJPl
— Mint (@livemint) August 17, 2026