LOADING...
Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్
Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్

Salman Khan: సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఇద్దరు అరెస్ట్

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
06:26 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని ముంబై సమీపంలోని పన్వేల్‌లో బాలీవుడ్ కండలవీరుడు నటుడు సల్మాన్ ఖాన్ ఫామ్‌హౌస్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జనవరి 4న జరిగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితులను అజేష్‌ కుమార్‌ ఓంప్రకాష్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌ తేజ్‌సింగ్‌ సిఖ్‌గా గుర్తించారు. సల్మాన్ ఖాన్‌కు పదే పదే వస్తున్న బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించిన ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనపై పన్వెల్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. విచారణ జరుగుతోందని వెల్లడించారు.

ముంబై

నకిలీ ఆధార్ కార్డులను చూపించి..

తొలుత నిందితులు అజేష్‌ కుమార్‌ ఓంప్రకాష్‌ గిల్‌, గురుసేవక్‌ సింగ్‌ తేజ్‌సింగ్‌ సిఖ్‌ ఇద్దరూ అర్పితా ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు. సల్మాన్‌ ఖాన్‌కు వీరాభిమానిని కాబట్టే తనను కలవాలనుకుంటున్నానని అక్కడున్న సెక్యూరిటీ గార్డులకు చెప్పారు. అయితే నిందితులు సెక్యూరిటీ గార్డుకు తప్పుడు వివరాలను అందజేశారు. అనంతరం పొదలు, సరిహద్దు గోడలు ఎక్కి, గోడకు ఉన్న ముళ్ల తీగలను తొలగించి ఫామ్‌హౌస్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఇది గమనించిన సెక్యూరిటీ గార్డులు పోలీసులకు ఫోన్‌ చేశారు. అనంతరం నిందితులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి పోలీసులు నకిలీ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకోవడం గమనార్హం.