Page Loader
Bomb Threats: ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ద్వారక,చాణక్యపురిలో సోదాలు 
ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ద్వారక,చాణక్యపురిలో సోదాలు

Bomb Threats: ఢిల్లీలోని రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపులు.. ద్వారక,చాణక్యపురిలో సోదాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 14, 2025
11:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపుల ఘటనలు కొనసాగుతున్నాయి. తాజాగా దిల్లీలోని పలు పాఠశాలలకు సోమవారం ఉదయం ఇలాంటి బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ విషయాన్ని గమనించిన వెంటనే పోలీసులు అప్రమత్తమై ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపట్టారు. పోలీసుల అందించిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని చాణక్యపురి ప్రాంతంలో ఉన్న నేవీ చిల్డ్రన్‌ స్కూల్‌ (Navy Children School)‌కి, ద్వారకాలోని సీఆర్‌పీఎఫ్‌ పబ్లిక్‌ స్కూల్‌ (CRPF Public School)‌కి సోమవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుండి బాంబు బెదిరింపులు వచ్చాయి. ఆగంతకులు స్కూల్‌ ఆవరణల్లో బాంబులు పెట్టినట్టు ఫోన్‌ చేసి తెలియజేశారు. ఈ సమాచారం అందుకున్న పాఠశాలల యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాయి.

వివరాలు 

రెండు పాఠశాలల్లోనూ బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో తనిఖీలు

సూచన అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు. రెండు పాఠశాలల్లోనూ బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో గట్టిగా తనిఖీలు నిర్వహించారు. ప్రతీ మూలను జాగ్రత్తగా తనిఖీ చేసిన పోలీసులు ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ, అనుమానాస్పద వస్తువులు గానీ కనుగొనలేకపోయారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఘటన వెనుక ఉన్న వారి అన్వేషణకు దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఢిల్లీలోని పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు