LOADING...
Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బిలాస్పూర్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి
ఛత్తీస్‌గఢ్‌ బిలాస్పూర్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ బిలాస్పూర్‌లో ఘోర రైలు ప్రమాదం.. ఆరుగురు మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 04, 2025
05:05 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొనడంతో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన మరికొందరిని ఆసుపత్రులకు తరలించినట్టు సమాచారం. ప్రమాదం జరిగి కొద్ది సేపట్లోనే రైల్వే అధికారులు, రక్షణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. రైలు బోగీల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఛత్తీస్‌గఢ్‌ బిలాస్పూర్‌లో ఘోర రైలు ప్రమాదం