Rajasthan: 'బీజేపీపై సీఎం గెహ్లాట్ సంచలన ఆరోపణలు.. ఉదయ్‌పూర్ టైలర్ కేసుతో కాషాయం పార్టీకి సంబంధం'
ఈ వార్తాకథనం ఏంటి
రాజస్థాన్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గెహ్లాట్ సంచలన ఆరోపణలు చేశారు.
ఈ మేరకు ఉదయ్‌పూర్‌లో జరిగిన హిందూ టైలర్ హత్య కేసులోని నిందితులకు బీజేపీతో ప్రమేయం ఉందని విమర్శలు గుప్పించారు.
కన్హయ్య లాల్‌ను ఇద్దరు నిందితులు గౌస్ మహమ్మద్, రియాజ్ అహ్మద్‌లు హత్య చేశారు. ఇప్పటికే ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా సృష్టించింది.
బీజేపీ నేత నుపుర్ శర్మకు మద్దతుగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనే కారణంతో కన్హయ్య లాల్ అనే టైలర్‌ను గతేడాది జూన్ 28న ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో అతిదారుణంగా తల నరికి చంపారు.
Details
కన్హయ్య లాల్ హత్య కేసులో నిందితులకు బీజేపీతో సంబంధం : గెహ్లాట్
ఈ క్రమంలోనే రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య లాల్ హంతకులు బీజేపీతో సంబంధం కలిగి ఉన్నారని ఆయన ఆరోపణలు గుప్పించారు.
రాష్ట్రంలో నవంబర్ 25న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాషాయ పార్టీ మత ఉద్రిక్తతలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు.
ఈ మేరకు ఆదివారం ప్రచార యాత్రలో భాగంగా జోధ్‌పూర్‌కు వచ్చిన గెహ్లాట్, విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ)కి బదులుగా రాజస్థాన్ పోలీస్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) ఈ కేసు విచారణ స్వీకరిస్తే సత్వర న్యాయం జరిగేదన్నారు.
జూన్ 28న ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితులు రియాజ్ అక్తారీ, గౌస్ మహ్మద్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
details
బీజేపీ నుంచి సస్పెండ్ అయిన నుపుర్ శర్మ
ప్రవక్తపై తీవ్ర ఆరోపణలు చేసినందుకు నుపుర్ శర్మ బీజేపీ నుంచి సస్పెండ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఉదయ్‌పూర్ టైలర్‌ని నరికివేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
దీంతో భారతదేశంలో తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఈ కేసు మొదట ఉదయ్‌పూర్‌లోని ధన్మండి ఠాణాలో నమోదైంది.
జూన్ 29, 2022న నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)కేసును టేపక్ చేసింది.
మరోవైపు ఈ ఘటన జరిగిన వెంటనే తాను ఉదయ్‌పూర్ కు బయలుదేరానన్న అశోక్ గెహ్లాట్, బీజేపీకి చెందిన కొంత మంది అగ్రనేతలు మాత్రం హైదరాబాద్ పర్యటనకు వెళ్లారని ఎద్దేవా చేశారు.
ఉదయ్‌పూర్ ఘటన దురదృష్టకరమైందని ఆయన పేర్కొన్నారు.