Loading...
Vijay's gold ring scheme: కొలిక్కి వచ్చిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకం.. రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం

Vijay's gold ring scheme: కొలిక్కి వచ్చిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకం.. రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 24, 2026
03:18 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించే 'మేనమామ బంగారు ఉంగరం' పథకం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది. ఈ ఉంగరాలపై సీఎం విజయ్‌ రూపంతో పాటు ప్రభుత్వ ముద్రను కూడా ముద్రించనున్నారు. తాము అధికారంలోకి వస్తే 'మేనమామ' పథకం కింద శిశువులకు బంగారు ఉంగరాలు అందిస్తామని టీవీకే అధినేత విజయ్‌ గతంలో హామీ ఇచ్చారు.

వివరాలు 

ఉంగరాల తయారీకి టెండర్లు

విజయ్‌ ఇచ్చిన హామీ మేరకు పథకాన్ని అమలు చేసేందుకు తమిళనాడు ప్రభుత్వం ఉంగరాల తయారీకి టెండర్లు ఆహ్వానించింది.

ప్రముఖ జ్యువెలరీ సంస్థ పైసా సర్వీసు ఫీజుతో ఈ టెండర్‌ను దక్కించుకున్నట్లు సమాచారం. పథకం అమలు కోసం ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.755.83 కోట్లను కేటాయించింది.

రెండు సంస్థలకు తయారీ బాధ్యతలు

ఉంగరాల తయారీ పనులను రెండు ప్రముఖ జ్యువెలరీ సంస్థలకు అప్పగించేలా ఒప్పందం కుదిరినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఇందులో జోయ్‌ ఆలూక్కాస్‌కు 70 శాతం, కల్యాణ్‌ జ్యువెలర్స్‌కు 30 శాతం పనులు అప్పగించినట్లు సమాచారం.

వివరాలు 

తొలిదశలో 1,28,499 ఉంగరాలు

పథకాన్ని సెప్టెంబరు 15న ప్రారంభించేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దివంగత మాజీ సీఎం అన్నాదురై జయంతి రోజున సీఎం విజయ్‌ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

తొలిదశలో 1,28,499 గ్రాము బంగారు ఉంగరాలను తయారు చేసేలా ఒప్పందం కుదిరిందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు వీటిని పంపిణీ చేయనున్నారు.

ADVERTISEMENT