Loading...
HYDRA: హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు.. 150 పోస్టులకు 3 వేల మందికిపైగా!
హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు.. 150 పోస్టులకు 3 వేల మందికిపైగా!

HYDRA: హైడ్రా ఉద్యోగాలకు పోటెత్తిన నిరుద్యోగులు.. 150 పోస్టులకు 3 వేల మందికిపైగా!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 09, 2026
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని హైడ్రాలో 150 ఉద్యోగాల భర్తీ కోసం సరూర్‌నగర్‌ స్టేడియంలో నిర్వహిస్తున్న ఎంపికలకు వేలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. 100 డిజాస్టర్‌ రెస్పాన్స్‌ ఫోర్స్‌ (డీఆర్‌ఎఫ్‌) పోస్టులు, 50 హెవీ వెహికల్‌ డ్రైవర్‌ పోస్టులను భర్తీ చేసేందుకు శని, ఆదివారాల్లో సరూర్‌నగర్‌ స్టేడియంలో ఫిజికల్‌ ఈవెంట్లు నిర్వహించనున్నట్లు హైడ్రా ప్రకటించింది. ఈ ప్రకటనతో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన నిరుద్యోగులు భారీ సంఖ్యలో శనివారం తెల్లవారుజామునే స్టేడియం వద్దకు చేరుకున్నారు. అభ్యర్థులు ఒకేసారి స్టేడియంలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో స్వల్పంగా తోపులాట చోటుచేసుకుంది. అభ్యర్థులను క్రమబద్ధీకరించే క్రమంలో ఓ అధికారి పరుషంగా మాట్లాడటంతో కొంత ఉద్రిక్తత నెలకొంది.

వివరాలు

3వేల మందికి పైగా అర్హత

అయితే అధికారులు అభ్యర్థులకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. దరఖాస్తుల స్వీకరణ, ఫిజికల్‌ టెస్టులకు టోకెన్ల జారీ సమయంలోనూ కొంత గందరగోళం ఏర్పడింది.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి అభ్యర్థులను విడతలవారీగా స్టేడియంలోకి పంపించారు. శనివారం నిర్వహించిన ఎంపికల్లో సుమారు 3 వేల మంది అభ్యర్థులు పాల్గొన్నట్లు సమాచారం.

ఎంపిక ప్రక్రియలో భాగంగా అభ్యర్థులు 800 మీటర్ల పరుగును 170 సెకన్లలో, 100 మీటర్ల పరుగును 15 సెకన్లలో పూర్తి చేయాల్సి ఉంటుంది.

ావీటితోపాటు లాంగ్‌జంప్‌, షాట్‌పుట్‌ అంశాల్లోనూ తమ ప్రతిభను నిరూపించుకోవాల్సి ఉంటుంది.

ADVERTISEMENT